తమిళాతికి చక్కని ఉదాహరణ తిరుక్కురళ్
ఈమధ్య తమిళనాడులోని చెన్నైలో ఉన్న
సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ నుంచి తిరువళ్లువార్ రచించిన
తిరుక్కురళ్ అనే గ్రంథాన్ని కొనడం జరిగింది. నేను పుష్కరం క్రితం ఈ తిరుక్కురల్
గురించి విన్నాను. ముఖ్యంగా తమిళనాడులో ఆర్టీసీ బస్సుల్లో తిరువళ్లువార్ సూక్తులు
దర్శనమిస్తాయని విన్నాను. అంతేకాదు ఏపీజే అబ్దుల్ కలాం, చిదంబరం, తమిళ పార్లమెంట్
సభ్యులు తిరువళ్లువార్ ఇలా అన్నారు, అలా అన్నారంటూ ఉటంకింపులు దినపత్రికల ద్వారా
మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అంతేకాదు 80 భాషల్లోకి అనువదించబడిన గ్రంథం కూడా
కావడంతో ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని ఆత్రం కూడా ఎక్కువయ్యి 300 రూపాయల డీడీ
పంపి కొనితెప్పించుకుని ఎట్టకేలకు చదివాను.
తిరుక్కురళ్ ఆద్యంతం చదివాక అర్థమయ్యింది
తమిళాతి అని ఎందుకంటారో...నిస్సారమైన గ్రంథమైనప్పటికీ తమిళులు తమ భాష, సాహిత్యం
మీద ఉన్న అతి అభిమానంతో ఎందుకు పనికిరాని గ్రంథాన్ని అహా ఓహో అంటూ
ఊదరగొట్టేస్తున్నారని. ఈ గ్రంథంలో ప్రధాన లోపం అనుభవ శూన్యత్వం(రాహిత్యం). రచయిత
స్వీయానుభవంతో కానీ, తన చుట్టూ ఉన సమాజాన్ని గమనించి కానీ రాసినట్లు ఈ గ్రంథంలో ఏ
ఒక్క పదం ప్రతిఫలించట్లేదు. పైగా గ్రంథ రచన కాలం నాటి సామాజిక,ఆర్థిక, భౌగోళిక,
చారిత్రక పరిస్థితులు ఏవీ మచ్చుకు కూడా రచనలో ప్రతిఫలించడం లేదు. బయటిప్రపంచంతో
సంబంధం లేకుండా, లోకానుభవంలేని వ్యక్తి నూతిలో కప్పలాంటి ఎవరో అనామకుడు తన పరిమిత
పరిధిలో తనకు తోచిందేదో రాసేసినట్లుంది గ్రంథం. దానికి ఒక లక్ష్యం దశ దిశ లేదు. ఈ
గ్రంథంలో లేనిదేదీ లేదని తమిళులు గొప్పలకు పోతున్నారు తప్ప అందులో సరకు లేదని
ఇట్టే చెప్పొచ్చు. ఈ రచన రాసినకాలంనాటికి సమాజం అంత సంక్లిష్టంగా లేదేమో. ఎందుకంటే
ఈ గ్రంథంలో విషయం సంక్లిష్ట సమాజాన్ని ప్రతిఫలించట్లేదు. చాలా సరళంగా ఉంది. సంక్లిష్టత,
వైవిధ్యత పెరిగిన ప్రస్తుత ప్రపంచానికి ఈ గ్రంథం ఆవశ్యకత ఇసుమంతైనా లేదు. నేటి కాలానికి
పనికొచ్చే విషయమేదీ లేదు ఈ గ్రంథంలో. ఈ గ్రంథం నీతి, రీతి ప్రస్తుత సమాజానికి
పనికిరావు. పైగా సార్వకాలీకత, సార్వజనీనత ఈ గ్రంథానికి వర్తించట్లేదు. నిస్సారమైన,
పనికిరాని, పనికిమాలిన సూత్రాలను గుంపగుత్తగా పొందుపరిచారు. ఈ గ్రంథాన్ని
తిరువళ్లువార్ పేరు మీద అనేక మంది రచయితలు వివిధ కాలాల్లో తమకు తోచింది ఏదో
రాసారేమోననిపిస్తుంది. ఇది అసలు లక్ష్యం లేని రచనగా చెప్పొచ్చు. కనీసం ఒక్క
పాదమైనా ఎంత బాగా చెప్పాడు రచయిత అని అనిపించేలా లేదు. నిర్జీవమైన రచన. పస లేని విషయం. చైతన్య రాహిత్యమైన రచన. జఢత్వ
రచన.
తమిళ వేదంగా తమిళనాడు వాసులు తమిళగ్రంథం
తిరుక్కురళ్ బదులు మన తెలుగు సామెతలు పాతిక చదివితే బోలెడంత జ్ఞానం, నీతి
లభిస్తాయి. లేదంటే మన వేమన రచించిన శతక పద్యాలు పఠిస్తే లోకం రీతి, నీతి, ధర్మం
సుబోధకంగా సులభ గ్రాహ్యంగా అవగతమవుతాయి. తిరుక్కురళ్ బదులు మన పాఠశాల స్థాయి ఏదైనా
ఒక తెలుగు వాచకం చదువుకున్నా బోలెడంత లోక జ్ఞానం, నైతిక విషయాలు, ధర్మబద్ధ
జీవనానికి అవసరమైన అనేక పాఠాలు తెలుసుకోవచ్చు.
తిరుక్కురళ్ పుస్తకాన్ని చదివాక తమిళుల
గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఎంత చెత్తైనా అది స్వభాష రచన అయితే
నెత్తినపెట్టుకోవడం తమళుల నైజం. పనికిరాని విషయాన్ని కూడా పదే పదే గొప్పగా పొగిడి
ఏదో ఉందనిపించేలా మోసం చేసే తమిళుల నైజమేమో...పరమ చెత్త సరకునైనా మార్కెట్
చేసుకుని లాభాలు గడించాలనుకుంటారు తమిళులు. స్వభాషపై అలవిమాలని అభిమానంతో పనికిరాని
రచనకు, రచయితకు పట్టం గట్టడం తమిళ భాషాభిమానుల నైజమేమో...తిరుక్కురల్ చదివాక
తెలుగు సాహిత్యం,భాషపై అభిమానం అనేక రెట్లు పెరగుతుంది. మన పద్యాలు, శతకాలు,
సాహిత్యం ఎంత గొప్పవో అవగతమవుతుంది. తిరుక్కురల్ చదివే బదులు నేటి కాలంలో విరివిగా
అమ్ముడుపోతున్న వ్యక్తిత్వ వికాస గ్రంథమేదైనా చదవినా (రచయితకు ప్రస్తుత వ్యక్తిత్వ
వికాస పుస్తకాలపై సదాభిప్రాయంలేదని గుర్తించగలరు.) కాసింత ప్రయోజనం
కలుగుతుంది. (ఈ అభిప్రాయాలు ఈ పుస్తకం
పరిధికి సంబంధించి మాత్రమే. తమిళంలోని సాహిత్యాన్నంతటినీ చదివాక చెబుతున్నవి కాదు.
పాఠకులు గుర్తించమని మనవి. )
పరిణతి చెందని సమాజానికి పరిణతి లేని రచన
ఉపయోగం లేదు. కౌటిల్యుని అర్ధశాస్త్రం, రామాయణ,మహాభారతాల నాటికే సమాజంలో క్లిష్టత,
రాజనీతి, ఆర్థికపరమైన పరిజ్ఞానం, సంక్లిష్ట సమస్యలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఆ
రచనల సమయానికి అటు ఇటుగా రచించినట్లుగా తిరుక్కురళ్ గురించి చెబుతున్నారు. మరి ఆ రచనలో అటువంటి
పరిస్థితులేవీ కనిపించట్లేదు. ఏ రచయిత అయినా చివరికి అనువాద రచయిత అయినా తన
సమాజంలోని సమకాలీన అంశాలను రచనలో ఏదో ఒక సందర్భంలో పేర్కొంటారు. కానీ తిరుక్కురళ్
లో అటువంటి సమకాలీన పరిస్థితులు అంటే సామాజిక భూమిక ఏదీ లేదు. సమాజానికి సంబంధం
లేని రచనగా తిరుక్కురళ్ రచన ఉంది. అంటే రచన యాంత్రికంగా ఉంది. చెత్త గ్రంథాన్ని
తెలుగు వారు నెత్తిన పెట్టుకోరాదనే ఈ చిన్న వ్యాస ఉద్దేశం. ఎవరి మనోభావాలను
దెబ్బతీయాలని కాదు. ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించగలరు.